యువత ఉపాధి కోసం బిజెపికి ఓటేయ్యాలి

యువత ఉపాధి కోసం బిజెపికి ఓటేయ్యాలి

◆ భారతీ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ మదన్ లాల్

 

ఖమ్మం, మే 6  ( జై తెలంగాణ న్యూస్ )

 

అభివృద్ధి ఉపాధి కోసం యువత బిజెపికి ఓటేయాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ మదన్ లాల్ అన్నారు.

 

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్ లాల్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ఎంపీగా గెలిచి యువతకు నామాలు పెట్టడం తప్ప నామా చేసింది శూన్యం అన్నారు. 11 రాష్ట్రాల్లో వ్యాపారాలు పారిశ్రామిక వేత్త అయిన నామా నాగేశ్వరరావు యువతకి చేసింది ఏమీ లేదన్నారు. జిల్లాలో అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండగా ముగ్గురు మంత్రులు నాకు కావాలి, నాకు కావాలని కొట్లాడుతుంటే బెంగళూరులో వ్యాపారం చేసే వ్యక్తిని తీసుకొచ్చి, కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. వారి వ్యాపారాలు చేసుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి తప్ప సేవ చేయడానికి రాలేదని యువత గమనించాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి 100 రోజుల్లో అభివృద్ధి చేస్తామని, పింఛన్ 4వేలకు పెంచుతామని, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సౌమ్యుడు, యువత ఉపాధి కోసం, ఖమ్మం జిల్లాను అభివృద్ధి పరిచేందుకు వచ్చిన అభ్యర్థిగా గుర్తించి, మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసేందుకు బిజెపికి ఓటేసి తాండ్ర ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి భానోత్ పృథ్వి రాథోడ్, రుద్రగాని మాధవ్ గౌడ్, గుగులోతు హుస్సేన్ నాయక్, బట్టు రాహుల్ నాయక్, ఎలిసెట్టి మణికంఠం, మహేందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :