రేపు బీఆర్ఎస్ రోడ్ షోను విజయవంతం చేయండి
కల్లూరు – జై తెలంగాణ న్యూస్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం నిర్వహించనున్న రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. గురువారం కల్లూరు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో సమావేశమైన అయన దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నామా విజయానికి కృషి చేయాలని కోరారు.