ఖమ్మంలో కొనసాగుతున్న చేరికల పర్వం
ఖమ్మం నగరం , మే 9 , జై తెలంగాణ న్యూస్
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఊపందుకుంటుంది. గురువారం ఖమ్మం 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఎండీ జావేద్ సమక్షంలో 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి లోక్ సభ అభ్యర్థికి భారీ మెజార్టీని అందించాలని కోరారు.