బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే
- నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు
- మోడేపల్లి కృష్ణమాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఖమ్మం ప్రెస్ క్లబ్, మే 9, జై తెలంగాణ న్యూస్
ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారంనాడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి* లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి *ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడానికి అహర్నిశలు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుంది అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ,బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకి ఒక భరోసా దొరుకుతుందని ఆనాడు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది అని వారు అన్నారు. కానీ గడిచిన పది సంవత్సరాలు కెసిఆర్ మాయమాటలతో దళితులను, గిరిజనులను, బీసీలను, ఉద్యోగులను,తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేశారని కెసిఆర్ మాటలకు బంగపడ్డ తెలంగాణ సమాజం కేసిఆర్ కోటను బద్దలు కొట్టి ప్రజా సంక్షేమ పరిపాలనందించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన తెలిపారు గతంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని కేవలం 18 శాతానికి తగ్గించిందని దాంట్లో భాగంగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకి కేవలం 9% మాత్రమే రిజర్వేషన్ అమలు చేశారని దాని ద్వారా అన్ని అర్హతలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా బీసీ నాయకులకు అవకాశలు రాలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జరగబోయే జనాభా లెక్కల్లో కులాలు వారిగా లెక్కలు తీస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినట్టుగా వారు తెలిపారు కాబట్టి ఖమ్మం జిల్లా బీసీ ప్రజానీకం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ఆర్ కృష్ణయ్య గారు నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తున్నారని అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేదని అటువంటి బీసీల వ్యతిరేక పార్టీని రానున్న రోజుల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె రామ్మోహన్ వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయి నాగేశ్వరరావు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చుల పద్మ చారి,జిల్లా నాయకులు మోడేపల్లి వెంకటాచారి, పులుసు అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు…