బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ?
మే 09 జై తెలంగాణ న్యూస్ ( కంటెంట్ రిపోర్టర్ జహంగీర్ పాషా )
మరో నాలుగు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది.
టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిని ఎదుర్కొనేందుకు వైసిపి అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తోంది.మూడు పార్టీల కూటమిపై విమర్శలు చేస్తూ.2019 నుంచి ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ జనాలకు అందాలంటే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతోంది.వైసిపి ఎన్నికల మేనిఫెస్టో ను జనాల్లోకి తీసుకువెళ్తోంది.
అయితే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోను మించి ఉండడం, భారీగా సంక్షేమ పథకాలను ప్రకటించడం, పింఛన్లు, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం వంటి వాటిని భారీగా పెంచి మ్యానిఫెస్టోలో ప్రకటించారు.ఆ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.
అలాగే సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించారు.తమ మేనిఫెస్టోనే తమను అధికారంలోకి తీసుకువస్తుందని నమ్మకంతో టిడిపి కూటమి ఉంది.
అయితే ఈ కూటమి హామీలపై వైసిపి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తోంది.
జగన్ ప్రతి ప్రచార సభలోను తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.జగన్ మొదటి నుంచి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా మళ్లీ తమను అధికార పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకంతో ఉన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గత ఐదేళ్లుగా టిడిపి, జనసేన నేతలు విమర్శలు చేస్తూనే వస్తున్నారు.చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ కంటే తాను మెరుగైన పథకాలు అందిస్తానంటూ చెబుతున్నారు.
అయితే దీనిని అవకాశంగా తీసుకుని వైసిపి జనాలకు అర్థమయ్యేలా కౌంటర్లు ఇస్తోంది.