ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

 

-ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా

 

-నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు

 

-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి

ఖమ్మం / జై తెలంగాణ న్యూస్

బీసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి తీవ్రంగా ఖండించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పై దాడి చేయటం హేయమైన చర్య అని ఆర్ కృష్ణయ్య పై దాడి యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని వారు అన్నారు.ఇలాంటి పిరికిపంద రాజకీయాలకు ఎవరూ భయపడరని ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే ఎటువంటి స్వేచ్ఛని హరింపజేసే ఇటువంటి చర్యలు దురదృష్టకరమని అందుకే మతోన్మాద పార్టీ భారతీయ జనతా పార్టీని ఈ తెలుగు రెండు రాష్ట్రాల నుంచి తరిమికొట్టాలనీ వారు పిలుపునిచ్చారు.గత 5 దశాబ్దాలుగా బీసీలు చదువుకోవాలని ఉద్యోగాలు చేయాలని అధికారంలో వాటా కోసం పోరాడి 12 వేలకు పైగా ఉద్యమాలు చేశారు.బీసీలు చదువుకోవడానికి రెండు రాష్ట్రాలలో 600 బీసీ హాస్టల్స్ ను 1500 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలును ఏర్పాటు చేయించారు.అలాగే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీం పెట్టించారనీ అధికారంలో వాటా పంచాయతీరాజ్ మున్సిపాలిటీ ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు పెట్టించారు.ఉన్నత విద్యావంతుడు నిత్యం ప్రతిరోజు బీసీ అభివృద్ధి కోసమే పోరాడుతుంటే ఓర్వలేక దాడి చేస్తారా అని అన్నారు. దాడుల నేపథ్యంలో ఆర్ కృష్ణన్నకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమీషన్ ను డిమాండ్ చేశారు.దాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టాలని అన్ని డివిజన్ మండల బీసీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె రామ్మోహన్ వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయి నాగేశ్వరరావు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చుల పద్మ చారి,జిల్లా నాయకులు మోడేపల్లి వెంకటాచారి పులుసు అశోక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :