అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు..?

అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు..?

 

ఎన్నికలు..?

మే చివరి వారంలో వార్డుల విభజన.. జూన్ మొదటి వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం..

 

అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు..?

 

  • మే చివరి వారంలో వార్డుల విభజన.. జూన్ మొదటి వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం..
  •  సర్పంచ్ లకు పాత రిజర్వేషన్లు..?
  • జూన్ మొదటి వారంలో షెడ్యూల్, జూన్ చివరి వారంలో నోటిఫికేషన్..
  • ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్..
  •  మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2గంటల తరువాత లెక్కింపు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక..

 

 

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు..

 

  •  దృష్టి సారించనున్న రాజకీయ పార్టీలు
  • సన్నద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

 

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాషా

అతి త్వరలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జూన్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జులై లో నోటిఫికేషన్, ఆగస్ట్ రెండవ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకు కాను రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆరు నెలల పాటు వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికలు ముగించడంతో పాటు ఆరు నెలల వాయిదా సమయం ముగుస్తుండటంతో కచ్చితంగా రెండు నెలల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఒక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం, మరో వైపు తెలంగాణ ప్రభుత్వం, ఇంకో వైపు పంచాయతీ రాజ్ శాఖాధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు.‌

 

లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, త్వరత్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే ఓ చానల్ ఇంటర్వ్యూలో ప్రకటించారు.దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సన్నద్ధమవుతోంది. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్‌శాఖ ద్వారా సేకరించింది. పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. తాజాగా బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవ్వగా.. మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక (ఎంపీటీసీ, జడ్పీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3న ముగియనుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. జూన్‌ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే బీసీ కమిషన్‌ రెండు మూడు నెలల వ్యవధిలో అభిప్రాయసేకరణ, ఇంటింటి సర్వే నిర్వహించి, నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దానిని ప్రభుత్వం ఆమోదించి, రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. దాని ఆధారంగా ఎన్నికలు జరిపే వీలుంది.

 

== ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

 

పంచాయతీ ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపిస్తోంది.. ఆరు నెలల వ్యవధిలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా, వెనువెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా..? వద్దా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేస్తుంది. తెలంగాణలో 12,814 గ్రామ పంచాయతీలు; 88,682 వార్డులు; 620 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(జడ్పీటీసీ); 6,473 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీ) ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు భారీ ప్రక్రియ ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీరహితంగా నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు చేపట్టాలి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఉంది. మండల, జిల్లా పరిషత్‌లకు వచ్చే జులై 3వ తేదీ వరకు గడువు ఉండగా.. ఆలోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు, పాలకవర్గాలు బాధ్యతలు చేపడతాయి. అప్పటిలోగా ఎన్నికలు జరగకపోతే మండల, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించాల్సి ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :