బడ్జెట్ పత్రాలను దహనం చేసిన పి.డి. ఎస్. యూ


బడ్జెట్ పత్రాలను దహనం చేసిన పి.డి. ఎస్. యూ

7.3%నిధులతో_రాష్ట్రంలో_విద్య_వ్యవస్థను ఏవిధంగాఅభివృద్ధి చేస్తారు?
…పి.డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్..

జై తెలంగాణ న్యూస్ ,25 జూలై(ఖమ్మం)

2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం రూ 21.292 కోట్ల రూపాయలు 7.3% మాత్రమే కేటాయించడం, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రస్తావించకపోవడం మరియు ఖమ్మం జిల్లా కు యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడన్ని నిరసిస్తూ పి.డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అర్ &బి గెస్ట్ హౌస్ సెంటర్ నందు బడ్జెట్ పత్రాల దహనం చేశామని పి.డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఓ ప్రకటన లో తెలిపారు.

ఈ సందర్భంగా పి.డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ….

కేజీ టు పీజీ విశ్వవిద్యా అంటే రాష్ట్ర బడ్జెట్లో రూ. 21.292 కోట్ల రూపాయలు, (7.3% శాతమే) కేటాయించడమేనా ? అని ప్రశ్నించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలకు మరియు గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అగ్గిపెట్టలో పుల్లల్లాగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నా పరిస్థితిని నేడు రాష్ట్రంలో కనిపిస్తుంటే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కనిపించడం లేదా అని ఎద్దేవ చేశారు.ఖమ్మం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని, బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా కు ప్రభుత్వ యూనివర్సిటీ ప్రస్థావన తెకపోవడం మరియు యూనివర్సిటీ కేటాయించాక పోవడం సిగ్గు చేటన్నారు..21.292,కోట్లతో రూపాయలతో యూనివర్సిటీల్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతాయన్నారు.తక్షణమే ఖమ్మం జిల్లా యూనివర్సిటీ కేటాయించి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినా హామీ ప్రకారం విద్యారంగ బడ్జెట్లో కొఠారి కమిషన్ ప్రకారం 30% శాతం నిధులు కేటాయించాలని అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్ మెంట్ 8వేల కోట్లు విడుదల చేయాలని లేని పక్షం లో పిడిఎస్ యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాని కైనా వెనుకాడబొమన్నారు.

 

ఈ కార్యక్రమం లో పి. డి. ఎస్. యూ ఖమ్మం డివిజన్ నాయకులు వంశీ, కిరణ్, సాయి, అనిల్, గణేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :