వక్ఫ్ ప్రతిపాదిత ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధం

వక్ఫ్ ప్రతిపాదిత ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధం

— విలువైన వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలు, పెత్తందారి వ్యవస్థలకు కట్టబెట్టేందుకు మోడీ, షా ల కుట్ర

ఖమ్మం , ఆగస్టు 10  జై తెలంగాణ డిజిటల్ 

వక్ఫ్ ప్రతిపాదిత ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇది కార్పొరేట్ సంస్థలు, పెత్తందారి వ్యవస్థలకు కట్టబెట్టేందుకు సానుకూలంగా వ్యవహరిస్తూ ఎన్.డి.ఏ భాగస్వామ్య పేరుతో మోడీ, అమిత్ షా లు కుట్ర చేస్తున్నారని జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఇలియాస్, ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు మహమ్మద్ అసద్ లు అన్నారు.

ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

ముంబైలోని ‘ఆల్టమౌంట్’ రోడ్ లో విలాసవంతమైన “యాంటీ ల భవనం” ముఖేష్ అంబానీ సొంత ఇల్లు. అది గతంలో అనాధ ఆశ్రమానికి ఒక ముస్లిం అల్లా పేరుతో దానం చేసినటువంటి వక్ఫ్ భూమి. అది మహారాష్ట్ర ప్రభుత్వం గెజిట్ లో నమోదు గావించబడి ఉంది. దానిని ధారాదత్తం చేసేవిధంగా ఎన్ఓసి ఇచ్చేందుకు వక్ఫ్ భూమి నిబంధనల ప్రకారం 9మంది సభ్యులలో 2/3 వంతు ఉండాలి. ఆరుగురు సభ్యుల ఒప్పందం ఉండాలి కానీ 5గురు సభ్యులు ఉండడం వలన ధారాదత్తం జరగదని వక్ఫ్ ప్రతిపాదిత ముసాయిదా బిల్లును అక్రమ పద్దతిలో అమలుచేసేందుకు మోడీ, అమిత్ షా లు కుట్ర చేస్తున్నారని, దీనిని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 450 ఎకరాల విస్తీర్ణ భూమిని ‘ల్యాంకో సంస్థ’ ఆక్రమణ చేసి సంస్థను నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో నాటి రాష్ట్రం వక్ఫ్ బోర్డు న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ భూమి వాళ్లకు చెందకుండా చేసిన విషయం విధితమే. ఈ విషయంలో సుప్రీంకోర్టులో లగడపాటికి చెంపపెట్టు అయిందన్నారు. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీలో 300 నుండి 700 ఎకరాల వరకు వక్ఫ్ భూమి ఉంది. ఈ విషయాన్ని నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తరువాత కబ్జా కాబడిన వక్ఫ్ భూములను ముస్లింలకు ఇప్పించే బాధ్యత నాదే అని, నాగళ్లతో దున్నుతానని తర్వాత కార్పొరేట్ పెద్దలకు కొమ్ముకాసి మోసం చేశాడని ఆరోపించారు. ఇది ఇప్పటికీ పెద్దందారి వ్యవస్థ కోరల్లోనే చిక్కుకొని ఉందన్నారు. ముస్లింల విలువైన వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలకు ధారాధత్వం చేసే ఇలాంటి ముసాయిదా బిల్లులను అన్ని మతాలవారు వ్యతిరేకించాలని ఈ సందర్భంగా కోరారు. వందలాది సంవత్సరాల కాలం నుండి ఐక్యమత్యంతో జీవిస్తున్న హిందూ- ముస్లిం సోదరుల మధ్య మత విబేధాలను సృష్టించడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్ లు ఇలాంటి ప్రణాళికను రచిస్తుంటారని విమర్శించారు.

దేశంలోని మొత్తం 18 కోట్ల ముస్లిం మైనార్టీల వక్ఫ్ భూముల కోసం దేశ స్థాయిలో ఉద్యమిస్తారని వారికి 100 కోట్ల హిందువులు కూడా అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో హిందువులకు సంబంధించిన దేవుడు మాన్యాల విషయంలో పాలకులు ఇదేవిధంగా ప్రవర్తిస్తే ముస్లింలు వారికి సపోర్ట్ గా నిలుస్తారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ముస్లిం మైనార్టి ఇంటలెక్చవల్ ఫోరం నేతలు, ముస్లిం మైనారిటీ నాయకులు, ఎంపీజే ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం, ఆబిద్ అలి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్.ఆర్.ఐ మహమ్మద్ అబ్ధుల్ అజీమ్, ఎహ్ సాన్, ముస్తఖీమ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :