ఘనంగా యలమందల జగదీష్ జన్మదిన వేడుకలు
ఖమ్మం /ఏప్రిల్ 11/ జై తెలంగాణ తెలుగు దినపత్రిక
నాయి బ్రాహ్మణ సంఘ నగర అధ్యక్షుడు జగదీష్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు,సంఘ సభ్యులు, సహచర జర్నలిస్టులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
కమ్యూనిటీ హాలు లో తొలుత సరిత క్లినిక్ సెంటర్లోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నందు సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందిస్తూ
అనంతరం జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా వందనం గ్రామంలోని ఇటీవల కాలంలో మరణించిన మంచికంటి రాములు,నేరడ గ్రామానికి చెందిన శ్రీపతి రాములు,ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన మేడిపల్లి రాము కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యవసర సరుకుల తో పాటు 25 కేజీల బియ్యం అందించారు.ఈ సందర్భంగా మన సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.
సామాజిక సంఘాల ఆధ్వర్యంలో
అనంతరం నగర ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు యూనియన్ నాయకులు,కెమెరామాన్లు,టౌన్ రిపోర్టర్లు,పత్రికా విలేకరులు,ఉద్యమ నాయకులు, దొడ్డి కొమరయ్య సహాయ నిర్మాతలు,అనంతరం రేవతి సెంటర్లో సాయి, శుభం,గణేష్ యూత్ ఆధ్వర్యంలో,ఖానాపురం రామాలయం నరేష్, నాగేశ్వరరావు,పవన్, దేవిష్ యూత్ ఆధ్వర్యంలో, పాండురంగాపురం వీరేష్ సాయి, రానా, యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర నాయి బ్రాహ్మణ సంఘ కుల పెద్దలు,ప్రెస్ క్లబ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.