ఆ మాయగాడి బాధితులు 300 మంది
కడప, (ADITYA9NEWS): అతడి పేరు ప్రసన్న కుమార్ రెడ్డి, అక్కడితో ఆగలేదు మరోక పేరు అలియాస్ ప్రశాంత్ రెడ్డి, ఇంకోపేరు అలియాస్ రాజారెడ్డి, క్యూట్‌గా పిలిచేవారికి టోని ఇలా రక రకాల పేర్లతో ఫోన్లలో అమ్మాయిలకు పరిచయమవుతాడు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమ్మాయిలకు, మద్యవయస్సుగల ఆంటీలకు వల వేస్తాడు. ఈ మాయగాడి వలలో చిక్కుకుని నగ్న చిత్రాలు పంపించిన వాళ్లకి బంపర్ ఆఫర్ ఇస్తాడు. అసలు రూపం బయటపెడతాడు. సిగ్గు పోకుండా ఉండాలంటే అతగాడు అడిగినంతా ఇచ్చుకోవాలి. ఈ కేటుగాడి వలలో చిక్కుకున్న వారి సంఖ్య చూసి పోలీసులే విస్తుపోయారు. పూర్తి వివరాలను కడప డీఎస్పీ సునీల్‌కుమార్ మీడియాకు వివరించారు.
కడప జిల్ల ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్నకుమార్‌రెడ్డి అనే యువకుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివి మద్యలో ఆపివేసాడు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతడు 2017లో చైన్ స్నాచింగ్, ఇళ్లలో దొంగతనాలు చేసి జైలు పాలయ్యాడు. అనంతరం బెయిల్‌పై వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డికి షేర్ చాట్ యాప్ ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పరిచయమైంది. తాను హైదరాబాద్ సచివాలయంలో ఉద్యోగస్తుడునని ,అటెండర్ ఉద్యోగాన్ని ఇప్పిస్తానని శ్రీనివాస్‌ను నమ్మబలికాడు. ఉద్యోగం వస్తుందని ఆశతో శ్రీనివాస్ తనకున్న బంగారు గొలుసును ఇచ్చాడు. ఆ తరువాత ప్రసన్నకుమార్ రెడ్డి ఫోన్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. జూలై 29న ఓ చోరీ కేసులో పట్టుబడ్డ ప్రసన్నకుమార్ రెడ్డిని విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. మాయ మాటలతో ఇతడు అమ్మాయిలకు, ఆంటీలకు వల వేసి వారి అర్థనగ్న, నగ్న చిత్రాలతో బ్లాక్ చేసి డబ్బులు వసూలు చేస్తాడని తెలుసుకున్నారు.ఇలా ఇతడి బాధితులు 300 మంది వరకూ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ప్రబుద్ధుడి గొప్పతనాన్ని వివరించారు. ఇతడి ఫోన్లో అన్నీ మహిళల ఫోటోలే ఉన్నట్టు కడప డీఎస్పీ తెలిపారు.
‘