జ‌గ‌న్@ 2.0

రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంది. క‌క్ష సాధింపువైపే జ‌గ‌న్ వెళుతున్నాడు,
తెలుగుదేశాన్ని నామ రూపాల్లేకుండా చేయాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌నంటూ
అచ్చ‌న్నాయుడి అరెస్టుతో టీడీపీ పెద్ద నాయ‌కుల్లో కంగారు మొద‌లైంది.
వాస్త‌వానికి తొలి ఏడాది పాల‌న‌లో జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌జలకు సంక్షేమ
ప‌థ‌కాలు, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ఏలా క‌ల్పించాల‌న్న‌దానిపైనే  ఎక్కువ
శ్ర‌ద్ధ చూపాడనే చెప్పాలి.  జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుండి
అవినీతి వ్య‌తిరేఖ మంత్రం పాటించాడు. వాస్త‌వానికి అది స‌మాజంలో అమ‌లు
కాక‌పోయినా, పార్టీ నేత‌ల‌ను, కేడ‌ర్‌ను అవినీతికి దూరం చేయ‌డంలో జ‌గ‌న్
ఒక్క అడుగు ముందుగానే ఉన్నాడు.  ఇదే సంద‌ర్భంలో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం
అవినీతి చేసిందంటూ వ‌చ్చిన ఆరోప‌ణల్ని జ‌గ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.
ఇందుకు కార‌ణం ఆధారాలు పూర్తిగా లేక‌పోవ‌డం. అందుకే అన్నిటికి వేచి
చూసాడు.  విచార‌ణ లోతులో ఉన్న ముసుగుల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి తొలి ఏడాది
వెచ్చించాడు. ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసుకోవ‌డం ఆయ‌న ముందు
చూపుగానే చెప్పుకోవాలి. మొద‌టి ఏడాదిలో జ‌గ‌న్ టీడీపీ హ‌యాంలో చేసిన
లోసుగుల ముసుగులను బ‌య‌ట‌పెట్టాల‌నుకున్న త‌గిన స‌మ‌యం కోసం తొలి ఏడాదిలో
జ‌గ‌న్ పాల‌న కేవ‌లం ప్ర‌జ‌ల వైపే మ‌ళ్ళించ‌డం,  జ‌గ‌న్ ఇక మ‌న‌ల్ని ఏం
చేయ‌లేడ‌న్న  ప్ర‌చారంతో  ప్ర‌తిప‌క్షానికి బ‌లం రెట్టింపైంది. టీడీపీని
ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు.. ఏది చేసినా టీడీపీలో మేధావుల ముందు జ‌గ‌న్ తెలివి
స‌రిపోదు అన్న‌ట్టుగా  టీడీపీ నాయ‌కులు  కేడ‌ర్‌లో బ‌లం నింప‌డానికి
విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ ప్ర‌చారం చేయ‌డంలో
ప్ర‌తిప‌క్షం ఒక‌రకంగా విజ‌యం కూడా సాధించినంత ప‌నిచేసింది.
అనుభ‌వ‌జ్ఞ‌లు ఎక్కువుగా ఉన్న పార్టీగా టీడీపీకి ముద్ర ఉండ‌నే ఉంది.
జ‌గ‌న్ ఏది చేసినా దానిలో త‌ప్పులు వెతికి భూత‌ద్దంలో చూపించేందుకు
రాత్రింబ‌ళ్లు టీడీపీ నాయ‌కులు క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. అనుభ‌వంలేని
త‌నంతో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు సాధార‌ణ జ‌నానికి కొత్త‌గా
ఉండ‌టంతో  విమ‌ర్శ‌ల తాకిడి పెరిగింది. దీంతో టీడీపీకీ ఇప్ప‌ట్లో లేని
బ‌లం పెరిగిన‌ట్లైయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ అస‌హ‌న గ‌డ్డు
కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఇసుక‌, మ‌ద్యం ధ‌ర‌ల పెంపు, ఎన్నిక‌ల క‌మిష‌న్
త‌ల‌నొప్పితో ఒక‌ర‌కంగా జ‌గ‌న్ మ‌రింత ఉక్క‌రిబిక్కిర‌య్యారనే చెప్పాలి.
క‌రోనా ఎఫెక్ట్ తో ఆర్థిక స్థితిగ‌తులు జ‌గ‌న్‌తో ఆడుకున్నాయి.కోర్టు
కేసుల్లో ఏ తీర్పు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌కు అనుకూలంగా
రాక‌పోవ‌డంతో పాల‌న ఎటు పోతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. తాజ‌గా
పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇసుక విధానంపై తిరుగుబాటు చేయ‌డం వైసీపీ
నేత‌ల్ని క‌ల‌వ‌ర‌పెట్టింది.  ఏలాగూ ప‌సుపు మీడియాగా ముద్ర వేసుకున్న ఓ
వ‌ర్గం మీడియా ప‌క్క‌గా టీడీపీకి కొమ్ము కాయ‌డంతో ఏడాదిలోనే  జ‌గ‌న్ ప‌నై
పోయింద‌నుకున్నారంతా.  ఇదంతా ఇప్ప‌టి వ‌ర‌కూ న‌డుస్తూ వ‌చ్చింది. కాని
జ‌గ‌న్ ఏడాది పాల‌న త‌రువాత తాజాగా ఆయ‌న పాల‌న మొత్తం వెర్ష‌న్ 2.0 కి
మారింద‌నేది న‌మ్మ‌ద‌గిన స‌త్యం. ఉహించ‌ని రీతిలో టీడీపీ లో బ‌ల‌మైన‌
నాయ‌కుల‌కు రెడ్ కార్పెట్ ప‌ర‌చిన జ‌గ‌న్  ఆదిశ‌గా మ‌రింత మందిని
పార్టీలోకి చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక‌ర‌కంగా
టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌. ఇదిలా ఉండ‌గానే ఏసీబీ చంద్ర‌బాబు కుడి
భుజంలా ఉన్న మాజీ మంత్రి కింజార‌పు అచ్చ‌న్నాయ‌డు ESI స్కాంలో అరెస్టు
చేసింది. అచ్చ‌న్న‌ను ఆధారాల‌తో ఏసీబీ అరెస్టు చేయ‌డం రాష్ట్రంలో
క‌ల‌క‌లం రేపింది. ఈప్ర‌భావం టీడీపీ హై కేడ‌ర్‌లో ఉన్న అంద‌రిపైనా
ప‌డింద‌నే చెప్పాలి. బీసీ నాయ‌కుడిని అరెస్టు చేశార‌ని ఆరోపిస్తున్న
టీడీపీకి అచ్చ‌న్నాయుడి అరెస్టు మైలేజీ క‌న్నా పెను ప్ర‌మాద సూచిక‌ను
చూపిస్తుంది.  టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ప్ర‌తీ ప‌నిపైనా విచార‌ణ‌కు జ‌గ‌న్
రంగం సిద్ధం చేసుకోవ‌డంతో రెండ‌వ ఎడాది పాల‌నలో జ‌గ‌న్  ప్ర‌తిప‌క్షంపైనే
ఫోక‌స్ పెట్టాడ‌నేది ఇప్ప‌డంతా చ‌ర్చ‌నీయాంశంజ.  తీగ లాగితే డొంక
క‌దిలిన‌ట్టు అచ్చన్నాయుడి వెనుక సూత్ర‌ధారులు వ‌స్తే టీడీపీకి మ‌రింత
గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌క‌పోవ‌చ్చు.  టీడీపీ నేత‌లు వ‌చ్చేందుకు పార్టీ
గేట్లు తెర‌చిన జ‌గ‌న్  మొత్తం టీడీపీని ఖాళీ చేయించాల‌న్న
ల‌క్ష్య‌మా..లేక చంద్ర‌బాబును ఒక్క‌డినే చేయాల‌నే  సంక‌ల్పమా అనేది
చ‌ర్చ‌గా మారింది. టీడీపీలో బ‌డా బాబులంతా చిన‌బాబు జ‌పం పాడ‌టంతో
దాదాపుగా అప్ప‌ట్లో జ‌రిగిన డ‌వ‌ల‌ప్‌మెంట్ వెనుక నేత‌ల డ‌వ‌ల‌ప్‌మెంట్
పైనా జ‌గ‌న్ వ‌ర్గం క‌న్నేయ‌డం , అవినీతి పై కూపీలు తీయ‌డం టీడీపీ
నేత‌ల్నిమ‌రింత‌గా క‌ల‌వ‌ర‌పెడుతుంది.  ఏసీబీ చెబుతున్న మాట‌లు, కోర్టుకు
వారి చూపిస్తున్న ఆధారాలు అచ్చ‌న్న కేసును ఏం మ‌లుపుతిప్పుతుంద‌నేది
టీడీపీని  భ‌య‌పెడుతోంది.రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉండే  ఏసీబీనీ
బ‌లోపేతం చేయ‌డంతోపాటు, అవినీతికి వ్య‌తిరేఖంగా ఆది నుండి జ‌గ‌న్ దిశా
నిర్ధేశం చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌డు ESI లో మందుల కొనుగోళ్లు
వ్య‌వ‌హారంలో, అచ్చ‌న్నాయుడి అరెస్టు చూస్తుంటే  జ‌గ‌న్ గేర్
మార్చాడ‌నేది సుస్ప‌ష్టంగా తెలుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ రాష్ట్ర
ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేశ్‌కుమార్ అంశంతో జ‌గ‌న్‌ను ఓ ఆట ఆడుకున్న
టీడీపీకి  జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేఖ ప‌థ‌కం ర‌చిస్తున్న
నేప‌థ్యంలో అచ్చ‌న్నాయుడి అరెస్టుతో టీడీపీ నేత‌ల‌కు మ‌తిపోయినంత
ప‌న‌య్యింది. ఇప్ప‌డిప్ప‌డే జ‌గ‌న్‌కు బ్రేక్‌లు వేసుకుంటూ వ‌స్తున్న
త‌రుణంలో  అచ్చ‌న్న అరెస్టుతో , ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ వెర్ష‌న్ 2.0
మొద‌లైంద‌నే చెప్ప‌కోవ‌చ్చు. అవినీతి ఆరోప‌ణ‌లు, విచార‌ణ‌లు ప‌క్క‌న
పెడితే టీడీపీపై జగ‌న్ పెట్టిన ఫోక‌స్ తో  ఇంకెన్ని మార్పులు ఉంటాయ‌నేది
ఓ ఏపిసోడ్‌లా మారితే అవినీతికి కెరాఫ్ జ‌గ‌న్ అంటూ ప్ర‌చారం చేసిన వారు
ఏం చెబుతారో..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :