14వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించనందుకు, ఉపాధి హామీ
పథకం ద్వారా ఇంటర్నల్ రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం వహించిన
పంచాయతీరాజ్‌శాఖకు చెందిన 15 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు
తీసుకునేందుకు ప్రభుత్వం జీవో 322 విడుదల చేసింది. పంచాయతీరాజ్‌శాఖ,
ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ద్వారా ఈ ఉత్తర్వులు
వెలువడ్డాయి. విశాఖ జిల్లా, కడప, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన
పంచాయతీరాజ్‌శాఖ ఈఈ, డీఈఈ, ఏఈలు, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు,
ఎంఈవో ఉన్నారు. ఇందులో కొంత మంది ఇటీవలే రిటైర్ ఉన్నారు. 14వ ఆర్థిక
సంఘం ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులను వీరు సక్రమంగా
వినియోగించలేదన్న అభియోగాలున్నాయి.
