కొరటాల దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి
సినిమా డెస్క్,(ADITYA9EWS): దర్శకుడు కొరటాల శివ యువ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఒక పల్లెటూరి ప్రేమకథ చేస్తున్నారు. మొదట్లో కొరటాల శివ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఒక పల్లెటూరి ప్రేమ కథను చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ అల్లు అర్జున్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ ప్రేమ కథ విజయ్‌దేవరకొండవైపు మళ్లీందని సినీ వర్గాల మాట.
గీత గోవిందం ఫేమ్ నటుడు మరియు కొరటాల శివ కాంబినేషన్‌గా, ఎన్టీఆర్ 30 తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి ,రామ్ చరణ్ లతో కలిసి ఆచార్య కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య పాటలు మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. దసరాకు ఆచార్య వస్తుందనే ప్రచారం చేస్తున్నారు. ఆచార్య విడుదల తర్వాత ఎన్టీఆర్ 30, అనంతరం విజయ్‌దేవర కోండతో పల్లెటూరి ప్రేమ కథపై దృష్టి పెడతారని, ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ సైతం చాలా బీజీగా ఉన్నారనే చెప్పాలి. ప్రస్తుతం పూరి జగన్నాధ్‌తో కలిసి లైగర్ అనే చిత్రంలో పని చేస్తున్నాడు విజయ్. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.