తెలంగాణా ముఖ్యమంత్రిపై షర్మిల వాగ్భాణాలు
హైదరాబాద్,: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై , నూతనంగా ఏర్పడిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా వాగ్బాణాలు వదిలారు. కేసీఆర్‌కి భూములు అమ్మే ఆశ చావదు, పైసల మీద దాహం చావదు. తెలంగాణా మొత్తం అమ్మినా ఆయన ఖర్చుకు సరిపోదంటూ విమర్శలు చేశారు. కేవలం హుజూరాబాద్ కోసం, మేఘా ఇంజనీరింగ్ సంస్థకు బకాయిలు ఇవ్వడం కోసం తప్పితే మరోకటి కాదంటూ మండిపడ్డారు.
తెలంగాణా భూములేమైనా కల్వకుంట్ల వారి భూములా ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి అంటూ ట్విట్టర్లో దుమ్మేత్తారు. కేసీఆర్ సీఎంలా కాదు, ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమె విమర్శలు వైరల్ అయ్యాయి.