అలా చేయండి..చాలు : అభిమానుల‌కు మ‌హేష్ పిలుపు

ప్ర‌తీ అభిమాని 3 మొక్క‌లు నాటాల‌ని కోరిన మ‌హర్షి

సినిమా డెస్క్‌, (ADITYA9NEWS) : చాలా అరుదుగా వార్త‌ల్లో , సోష‌ల్ మీడియాలో ఉండే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను కోరిక కోరుతూ హాట్ టాపిక్ అయ్యాడు. ఆగ‌ష్టు 9వ తేదిన త‌న పుట్టిన రోజు కావ‌డంతో, అభిమానులెవ‌రూ డ‌బ్బులు వృధా చేసుకోవ‌ద్ద‌ని పిలుప‌నిచ్చాడు.త‌న‌కు కృత‌జ్ఞ‌త‌గా క‌నీసం ఒక్కొ అభిమాని 3 మొక్క‌లు నాటండి చాలంటూ కోరాడు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కి మద్దతుగా నా పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ పోస్ట్‌లలో నన్ను ట్యాగ్ చేయండి. నేను వాటిని కూడా చూడగలను ”అని మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నటుడు రాజ్యసభ ఎంపీ జె సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మ‌ద్ధ‌తిస్తున్నారు.

ఇదిలా ఉంటే, మహేష్ బాబు తన 46 వ పుట్టినరోజును ఆగస్టు 9 న జరుపుకుంటారు. ఆ రోజున ‘సర్కారు వారి పాట’ చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :