తీర్పు న‌చ్చిన‌ట్టుగా రాక‌పోతే ..అంతేనా

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ వ్యాఖ్య‌లు

దిల్లీ ,(ADITYA9NEWS):

దేశంలో కొత్త ధోరణి అభివృద్ధి చెందింది. న్యాయమూర్తులకు స్వేచ్ఛ లేదు . న్యాయమూర్తులు IB మరియు CBI కి ఫిర్యాదు చేసినా వారి నుండి ఎటువంటి సహాయం అంద‌డం లేదు. ఇది తీవ్ర‌మైన విష‌యం – సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ‌

ప్ర‌జ‌లెవ‌రికైనా వారికి న‌చ్చిన‌ట్టుగా న్యాయం అంద‌క‌పోతే వారి ప్ర‌వ‌ర్త‌న మారిపోతుంద‌ని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. తీర్పు న‌చ్చ‌క‌పోయినా, వారికి అనుకూలంగా రాక‌పోయినా , ఇతర సామాజిక సందేశాల ద్వారా న్యాయ‌మూర్తుల‌పై దృష్ప్ర‌చారం చేయ‌డం అల‌వాటుగా మారిపోయిందంటూ మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌రిణామం కాద‌న్నారు.

జార్ఖండ్‌లో న్యాయ‌మూర్తి ఉత్తమ్ ఆనంద్‌ను, ఆటో రిక్షాతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌పై కేసులో సుమోటోగా స్వీక‌రించిన ఈకేసును సుప్రీంకోర్టు ఒక వారంలోగా చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ ద్వారా జార్ఖండ్ ప్రభుత్వం నుండి విచారణపై తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి నివేదిక ఇవ్వాల‌ని తెలిపింది. తదుపరి దర్యాప్తు కోసం కేసును సిబిఐకి అప్పగించామని, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని జార్ఖండ్ ప్రభుత్వం కోర్టుకు విన్న‌వించింది. ఈకేసు సంద‌ర్బంగా న్యాయ‌మూర్తుల‌కు ర‌క్ష‌ణ అంశంపై ఉద్ద్యేశించి, ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ పై వ్యాఖ్య‌లు చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :