ఆల‌య ప్రాంగ‌ణంలో కంపోస్టు త‌యారీ

సిద్ధిపేట మున్సిపాల్టీ వినూత్న ప్ర‌యోగం

సిద్దిపేట,: డంప్ యార్డులకు చేరుతున్న వ్యర్థాల పరిమాణాన్ని పరిమితం చేయాలనే లక్ష్యంతో, సిద్దిపేటలోని దేవాలయాల ప్రాంగణంలో కంపోస్ట్ పిట్‌లను ఏర్పాటు చేయాలని సిద్దిపేటలోని మున్సిప‌ల్‌ అధికారులు నిర్ణయించారు. సిద్దిపేట మునిసిపాలిటీ కమిషనర్ కెవి ర‌మ‌ణాచారి శుక్రవారం ఆలయ పూజారులను ,శరబేశ్వర స్వామి , రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్వాహకులను కలిశారు, పువ్వులు, పండ్లు మరియు ఇతర వ్యర్థాలను ఉపయోగకరమైన వర్మికంపోస్ట్‌గా తయారు చేయవచ్చని వారికి అవగాహన కల్పించారు.

ఇది చాలా మంచి ఎరువులు అని చెబుతూ, ఆలయ భూముల్లో పువ్వు మరియు పండ్ల చెట్లను పెంచడానికి వర్మీకంపోస్టును ఉపయోగించవచ్చని కమిషనర్ సూచించారు. డంప్ యార్డుకు చేరే వ్యర్థాలను పరిమితం చేయడంలో రెండు ప్ర‌యోజ‌నాలుంటాయ‌న్నారు. వ్యర్థాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంలో ఇది వారికే సహాయపడుతుందని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :