ఎమ్మెల్సీ తోట‌కు క‌రోనా పాజిటివ్‌

అనుచ‌రులు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరిన ఎమ్మెల్సీ

మండ‌పేట‌, (ADITYA9NEWS):తూర్పుగోదావరి మండపేట వైసీపీ కో ఆర్డినేటర్ , ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శుక్ర‌వారం ఆయ‌న రాజ‌మండ్రిలో దివంగ‌త నేత జక్కంపూడి జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఆ త‌రువాత ఆయ‌న‌కు జ్వరం, తలపోటుగా వుండటంతో రాజమండ్రి సాయి ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అనంత‌రం ఆయ‌న‌కు పాజిటివ్ అని తేల‌డంతో హోమ్ ఐసోలేష‌న్ కు వెళ్లారు. అయితే తోట గ‌న్ మేన్ల‌కు క‌రోనా పరీక్ష‌లు జ‌రిగాయి. వారికి మాత్రం నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.త‌నతో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనుచ‌రలు క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని తోట త్రిమూర్తులు సూచించారు. ఇదిలా ఉండ‌గా వైసీపీ రాష్ట్ర నాయ‌కులు మెండుగుదిటి మోహ‌న్ కు కూడా క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింది. ఈయ‌న నాలుగు రోజుల క్రితం తోట వెంట ప‌లు కార్య‌క్ర‌మాలు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం రాజమండ్రి సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :