మ్యూటేషన్ ప్రభావం తప్పదంటున్న శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్, (ADITYA9NEWS): కరోనావైరస్ నిరంతరం పరివర్తన చెందుతూ ప్రపంచ దేశాలకు కొత్త సవాళ్లను విసురుతుంది. ఒకపక్క డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇంతలోగా లాంబ్డా, జీటా వంటి ఇతర వేరియంట్లు రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారుతాయని భావిస్తున్నారు. ఈ వేరియంట్ల మార్పును WHO గమనిస్తూనే ఉంది.
తాజా అధ్యాయనాలు పరిశీలిస్తే ప్రస్తుతం వస్తున్న వేరియెంట్ల ప్రభావం మూడు రెట్లు అధికమని అంచనా వేస్తున్నారు. వేరియంట్ మ్యూటేషన్ ప్రభావంతో అది ఎక్కువ ఉంటుందా, తక్కువగా ఉంటుదనేది కొన్ని అధ్యాయనాలు ఇంకా అస్పష్టంగానే చెబుతున్నాయి. వీటికి సరియైన మందు కేవలం టీకా అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
వేరియెంట్ ఏలా ఉన్నా టీకా మాత్రం అదుపు చేస్తుందనేది శాస్త్రవేత్తల నమ్మకం. వ్యాధి సోకే వ్యక్తుల్లో వైరస్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మ్యూటేషన్ ప్రభావం ఆ వ్యక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు వైరస్ సోకిన వ్యక్తి అధిక ఒత్తిడిని కలిగి ఉంటాడనేది వైద్యుల మాట.
.