టోక్యో, (ADITYA9NEWS): నీరజ్ చోప్రా..ఇప్పుడు భారతదేశం అంతా వినిపిస్తున్న మాట. దేశం గర్విస్తోంది. ఒలింపిక్స్‌లో భారత్ ప్రస్థానం ముగిసిందన్న ప్రచారానికి అడ్డుకట్ట వేశాడు. జావెలిన్ త్రో లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించాడు. స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అథ్లెట్‌లో సత్తా చాటాడు. నీరజ్ చోప్రా గ్రూప్-ఎలో విజయం సాధించిన తరువాతే జావెలిన్ త్రో పై ఆశలు పెరిగాయి భారతీయులకు.
అప్పటికే పీవీ సింధు, మేరీ కోమ్, మనీకా బాత్రా, సాయి ప్రణీత్, సానియా మీర్జా లాంటి వాళ్లు పతకాలు తెస్తారని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను మాత్రం దేశానికి రజత పతకం తెచ్చింది. ఇలాంటి సమయంలో జావెలిన్ త్రో క్రీడ భారత్ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చింది. స్వర్ణం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న నీరజ్ కు దేశం యావత్తు అభినందనలు చెబుతోంది.