12న ముహుర్తం..ఘనంగా ఏర్పాట్లు
పిఠాపురం, (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నూకాలమ్మ తల్లి ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ మహోత్సవాన్ని ఈనెల 12న నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ నిర్వాహకులు శ్రీ వాగ్దేవి ట్రస్ట్ ఛైర్మన్ ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ , వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల అనుగ్రహంతో ఈనెల 12న ఉదయం 9.14 నిమిషాలకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుందన్నారు. పిఠాపురం పరిసర ప్రాంత భక్తులు కోవిడ్-19 నిబంధనలకు లోబడి హాజరుకావాలన్నారు. పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఎంతో శక్తి వంతమైన ఆలయంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నందున ప్రతీయేటా విశిష్ఠ మహహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు గోపాలకృష్ణ శర్మ తెలిపారు.