టీటీడీ ఛైర్మ‌న్‌గా మ‌రోసారి వైవీ

జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

తిరుమ‌ల‌,(): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియ‌మిస్తూ జ‌గ‌న్ సర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సుబ్బారెడ్డిని ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. తాజాగా ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్త‌య్యింది. గ‌త కొద్ది రోజులుగా ప‌లువురి పేర్లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ మ‌రోసారి వైవీకే అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌. ఇదిలా ఉండ‌గా పాల‌క మండ‌లి స‌భ్యుల‌ను మాత్రం నియ‌మించలేదు. మ‌రో రెండు రోజుల్లో స‌భ్యుల‌ను కూడా నియ‌మించే అవ‌కాశం ఉంది. ఈసారి స‌భ్య‌ల్లో పాత వారే ఉంటారు, కొత్త వారి చేరిక ఉంటుందా అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :