- చిక్కుల్లో వరుడు కావలెను నిర్మాతలు
సినిమాడెస్క్,(): వరుడు కావలెను సినిమా నుండి ఇటీవల విడుదలైన దిగు దిగు నాగ అనే పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతీసారంటూ సినిమా నిర్మాతలపై మహిళా మోర్చా సభ్యులు కేసు పెట్టారు. దిగు దిగు నాగ పాట హిందు మత ప్రయోజనాలకు పూర్తి విరుద్దమని, ప్రజల విశ్వాసాన్నికించ పరిచారని ఆరోపించారు. పాట రాసిన అనంత శ్రీరామ్‌పై లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా మోర్చా సభ్యుల నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. వరుడు కావాలెను సినిమాలో నాగ శౌర్య మరియు రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.