సాధారణంగా గ్రహణం అనేటప్పటికీ అన్ని ఆలయాలు మూసివేస్తారు. ఇది అనాది
నుండి వస్తున్న ఆచారం. కాని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో
వేంచేసియున్న శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయం తలుపులు మాత్రం గ్రహణం
సమయంలో కూడా తెరచే ఉంటాయి. రాష్ట్రంలో శ్రీ కాళహస్తి, పిఠాపురం
కుక్కుటేశ్వరస్వామి ఆలయం మాత్రమే ఈ గ్రహణ సమయాల్లో తెరచి ఉండటం
ప్రత్యేకత . పాదగయ పుణ్యక్షేత్రంలో కరోనా నిబంధలను అనుసరించి, సామాజిక
దూరం పాటించి దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
