వివాదస్పద పోస్టింగ్ లు పెట్టాడు..శవమై తేలాడు


కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగ‌చర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్‌ అనే
యువకుడు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ క్రియేట్‌ చేసి అతడికి నచ్చినట్లుగా
వివాదస్పదమైన పోస్టింగ్‌లు పెడుతున్నాడు. వీటితోపాటు వాట్సాప్‌
గ్రూప్‌ల్లోనూ ఇష్టానుసారంగా పోస్టు పెడుతుండటంతో సంచల‌నంగా మారాడు.
చివరకు అతనంటే గిట్టని వారో, అత‌డి పోస్టింగ్‌ల వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డారో
తెలియదుకాని చంపి పూడ్చి పెట్టారు.

గత నాలుగు రోజులుగా నవీన్‌ కనిపించకపోవడంతో అతడి తల్లి నందిగామ
పోలీసుల‌ను ఆశ్రయించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ
ప్రారంభించారు. నందిగామ కాకతీయ స్కూల్‌రోడ్డులో పాతిపెట్టి ఉన్న నవీన్‌
మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ కేసులో ఉన్న‌దెవ‌ర‌నే కోణంలో ద‌ర్యాప్తు
ముమ్మ‌రం చేసిన పోలీసులు నిందితుల‌ను త్వ‌ర‌లో అరెస్టు చేస్తామ‌న్నారు.
ఇదిలా ఉండ‌గా మృతుడు గంటా నవీన్‌పై నందిగామ స్టేషన్‌లో గతంలోనే రౌడీ
షీట్‌ తెరిచారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :