తాను ఇంకా పెళ్లి చేసుకోనని, ఇష్టం లేని సంబంధాలు చూడొద్దని చెప్పినా
వినకపోవడంతో ఒక యువతి బలవన్మరణానికి ఒడికట్టింది. కొత్తపల్లి
మండలం కొత్తమూలపేట సెజ్ కాలనీకి చెందిన పి. సుగుణ అనే యువతి సెజ్‌లో ఉన్న
కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. శనివారం డ్యూటీకి వెళ్లిన ఆమె తిరిగి
ఇంటికి రాలేదు. శీలం వారి పాలెం వద్ద వంతెనపై నుండి ఉప్పుటేరులో దూకి
ఆమె ఆత్మహత్య చేసుకుంది. అదే మార్గంలో వెళుతున్న కొంత మంది మృతదేహాం
నీటిపై తేలియాడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపల్లి ఎస్సై పార్థసారధి సంఘటనా ప్రాంతానికి వెళ్లారు. అనంతరం యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. గత కొద్ది రోజులుగా ఆమెకు ఇష్టం లేని సంబంధాలు
తీసుకొస్తున్నారని, పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులతో గొడవ
పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు
పాల్పడటానికి ఇదొక్కటే కారణమా..? ఇతరేత్రా కారణాలు ఉన్నాయా.. అనే
కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
