వారంతా ఒకే సచివాలయంలో సరదా కొంత కాలం గడుపుకున్నారు. ఏమైందో ఏమో
తాజాగా రెండగ్రూపులుగా విడిపోయారు. కలిసున్నపుడు కాలంలో తీసుకున్న
వీడియోలు, తాజాగా చేసుకున్న టిక్‌టాక్‌లను, సెల్ఫీలను బయట పెట్టుకుని
రోడ్డెక్కారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని 5వ వార్డు
సచివాలయంలో ఉన్న వలంటీర్లు, సచివాలయ సిబ్బందిలో కొంత మంది కలిపి
గ్రూపులకు తెరలేపడంతో వివాదం ముదిరింది. పాత వీడియోలతోపాటు, ఇటీవల
కాలంలో తీసుకున్న సెల్ఫీ వీడియోలను బయట పెట్టుకోవడం, అవి సోషల్
మీడియాలో హల్‌చల్ సృష్టించడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
చేసుకున్నారు.దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు. వీడియోలు చేసిన
వారికి, వాటిని బయటపెట్టిన వారికి కూడా మెమోలు జారీ చేశారు.
ఒకపక్క ప్రజా సేవ చేయాలని, జూనియర్ కలెక్టర్లుగా వలంటీర్లు
పనిచేయాలని భావిస్తుంటే, రాజకీయ వలంటీర్ల పెత్తనంతో మిగిలిన వారికి
ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సచివాలయాల్లో స్థానిక
వలంటీర్లు పార్టీల పెత్తనం చూపించడంతో ఇటువంటి వివాదాలు
తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే
రాజకీయ వలంటీర్లు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ లక్ష్యానికే ముప్పు
తెచ్చేలా ఉన్నారని వైసీపీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
