తూ.గో.జిల్లాలో ఉపాధ్యాయుడి అద్భుత సృష్టి
అంతరించిపోతున్న కళకు అతడు ఆధ్యం పోశాడు. లీఫ్ కార్వింగ్ కళను
తెరపైకి తెచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన
జగ్గంపేట మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న పిల్లి గోవిందరాజు
అనే ఉపాద్యాయుడు. పిల్లలకు విద్యాబోధనతోపాటు తనకున్న కళల్లో భాగంగా ఆకులపై బొమ్మలు చెక్కుతూ అబ్బుర పరుస్తున్నాడు.
తాజాగా జూన్ 21 ప్రపంచ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని బాదం ఆకుపై
10 రకాల యోగసనాలను చెక్కాడు. ఈ కళను ఆయన సొంతంగా నేర్చుకున్నానని
చెబుతున్న గోవిందరాజులు మాస్టారు, యోగాసనాల ద్వారా విద్యార్థులకు మంచి
సందేశాన్ని ఇవ్వాలన్నదే తన ఉద్ధేశ్యమన్నాడు. గోవిందరాజులు
ప్రదర్శిస్తున్న కళను అందరూ అభినందిస్తున్నారు. స్టేట్ రిసోర్స్
పర్సన్‌గా ఉన్న ఆయన తోలుబొమ్మల ద్వారా పాఠాలు బోధించడంలో కూడా
ప్రత్యేకత చాటుతుండటం విశేషం.