రేఖ చుట్టూ కాక

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది. క‌ర‌ణ్ జోహార్, బోనీ క‌పూర్, అమీర్ ఖాన్ త‌దిత‌ర సెల‌బ్రిటీల సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా న‌టి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముంబైలోని ఆమె బంగ్లాని బీఎంసీ సీల్ చేసింది.

భ‌వ‌నం వెలుప‌లు కంటైన్‌మెంట్ జోన్‌గా నోటీసు కూడా అంటిచారు. రేఖా బంగ్లా ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఉంది . దీనికి సీ స్ప్రింగ్స్ అని పేరు పెట్టారు. ఈ ఇంటికి కాప‌లాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎప్పుడూ ఉంటారు. వారిలో ఒకరికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో మిగ‌తా సిబ్బందికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. రేఖ ఇంటి ప‌క్క‌న ఉంటున్న లిరిసిస్ట్ జావేద్ అక్త‌ర్ బిల్డింగ్‌లో కూడా కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :