గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నాం: సీఎం
ప్రతి సచివాలయ ఉద్యోగి కచ్చితంగా సచివాలయంలోనే కూర్చుని విధులు నిర్వహించాలి. గ్రామ వాలంటీర్లను కూడా కనీసం వారంలో మూడు రోజుల పాటు సచివాలయంలో హాజరు ఇవ్వాలి, ఏ సమయంలో అయినా సరే వారు హాజరు ఇవ్వవచ్చు.
జేసీలు పర్యవేక్షించి, ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను భర్తీచేయాలి.ప్రభుత్వ పథకాలను అమలు చేసే సందర్బంలో వాలంటీర్ అందుబాటులో లేకపోతే ఇబ్బందులు వస్తాయి.
– గ్రామ సచివాలయాల్లోని ప్రతి సేవకు నిర్థిష్టమైన సమయంలో పూర్తి అవుతుందా లేదా అని కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలి.
– కలెక్టర్లు, జెసిల పనితీరును దీని ఆధారంగానే పరిగణలోకి తీసుకుంటాం:
– ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన టైం లైన్లోనే పనిచేయాలి.
– ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట సమయంలో 91శాతం రైస్ కార్డులను ఇస్తున్నాం, 76.60 శాతం ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. 97 శాతం పెన్షన్లు మంజూరు జరుగుతోంది. దీనిని నూరుశాతం జరిగేలా చూడాలి. ఇంటి స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు 90 రోజుల్లో పూర్తి కావాలి. అర్హత వున్న వారికి నిర్ధిష్టమైన సమయంలో మంజూరు ఇవ్వలేకపోతే కలెక్టర్లు, జెసిలే బాధ్యత వహించాలి.
– కలెక్టర్లు వారానికి రెండుసార్లు గ్రామ సచివాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి.
– వారానికి నాలుగు సార్లు జెసిలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి.
– హెచ్ఓడిలు, సెక్రటరీలు కూడా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి.
– ఇది ఖచ్చితంగా జరగాలి, దీనిని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం.
– రెండు వందల మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ఇప్పటికే పనిచేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల్లో జరుగుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది.
– సచివాలయం, మండల, జిల్లా స్థాయి వరకు ఈ కాల్ సెంటర్ పరిధిలోకి వచ్చారు.
– హెచ్ఓడి, సెక్రటరీ స్థాయి వరకు ఈ కాల్ సెంటర్ పరిధిలోకి తీసుకురాబోతున్నాం.
– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 16208 పోస్ట్‌లకు ఈ నెల 25,26 తేదీల్లో పరీక్షలు, 2228 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
– కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలి.