అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే..!
కాకినాడ(ADITYA9NEWS): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోట చాలా కాలానికి రాజధాని మాట మరోసారి బటయకొచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపం కొమరిగిరి వద్ద ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై బాణాలు ఎక్కుపెట్టారు. ఇందులో భాగంగా అమరావతి రాజధాని అనేది ఎంత వరకూ సబబు అనే దానిపై పరోక్షంగా ఆయన మాటల్లో స్పష్టమైంది.
రాజధాని అనేది అన్ని మతాలు, కులాలకు ప్రతీకగా ఉండాలన్న వాఖ్యలు జగన్ నోటి వెంట రావడంతో అమరావతికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం బ్రేకులు వేసిందనే చెప్పుకోవాలి. అమరావతి రాజధాని చంద్రబాబు అనూయలకే అన్న ప్రచారం చేస్తున్న వైసీపీ, టీడీపీ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తూవస్తుంది. మరోపక్క అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ అక్కడ భూములిచ్చిన రైతులు ఏడాదిగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
తాజాగా జగన్ మాటలు పరిశీలిస్తే అమరావతి రాజధానిగా ప్రభుత్వం ఏ కొసానా ఇష్టపడటం లేదనేది తేటతెల్లమవుతోంది. విశాఖకు రాజధాని తరలిపోతుందన్న ప్రచారానికి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకుర్చాయి.
ఒక పక్క అమరావతి రైతులు, వారికి మద్ధతిస్తున్న వామపక్షాలు ఎట్టి పరిస్థితులో అమరావతినే రాజధానిగా ఉంచాలని పట్టుబడుతున్న నేపథ్యంలో అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ అమరావతి రాజధాని సరికాదనే పరోక్ష వ్యాఖ్యలు రాజధాని అంశంపై మరోసారి చర్చకు తెరలేపాయి.