మహబూబ్ నగర్(ADITYA9NEWS):దేశ సైనికుడి పాడె మోసిన ఘనతను ఆ మంత్రి దక్కించుకున్నారు.మ హబూబ్‌నగర్ జిల్లా గువ్వని కుంట తండాకు చెందిన అమర జవాన్ పరశురామ్ మృతిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పరశురామ్ అంత్యక్రియలకు హాజరైన ఆయన జవాన్ పాడె మోసారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తరుపున దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, మహబూబ్ నగర్ లో రెండు పడక గదుల ఇల్లు పరుశురాం కుటుంబానికి అందిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు.
వీర సైనికుడి అంత్యక్రియలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దారి పొడుగునా స్థానిక ప్రజలు అమర జవాన్ అంతిమయాత్రలో జాతీయ జెండాలతో వీడ్కోలు పలికారు.