తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బైపాసురోడ్డుకి ఆనుకుని ఉన్న దివ్యమైన పాదగయా క్షేత్రాన్ని కాశీ సమాన క్షేత్రంగా కొలుస్తారు .శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైన దేవాలయం.. పురాణంలోకి వెళితే, గయాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మా చేత ఖండించబడి వరం పొందుతాడు. తన శరీర భాగాలు పడిన ప్రాంతాలు దివ్యక్షేత్రాలుగా విరాజిల్లాలని పొందిన బ్రహ్మా వరంతో శిరోగయ, నాభిగయ, పాదగయ క్షేత్రాలు వెలిశాయి. ఇందులో పిఠాపురం పాదగయ క్షేత్రం విశిష్టమైంది. ఇక్కడ గయాసురుడ పాదాలు పుష్కరిణి అడుగు బాగంలో పడ్డాయని చెబుతారు. పెద్దలకు పిండ ప్రదానాలు ఇక్కడ నిర్వహించుకుంటారు.కాశీ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు తమ పెద్దలకు కర్మకాండలు పాదగయలో నిర్వహించుకుంటారు. పరమవశివుడి ప్రతిరూపంగా ఈదేవాలయానికి పేరుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒడిస్సా, మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. ఈక్షేత్రంలోనే 10వ శక్తీ పీఠంగా పిలువబడే పురుహూతికా అమ్మవారి శక్తీ పీఠం కొలువై ఉంది. స్వయంభు దత్తాత్రేయస్వామి భక్తులకు నిత్యం దర్శనమిస్తారు. పాదగయ 1 కీలోమీటరు దూరంలో శ్రీ పాద శ్రీ వల్లభుడు సంస్థానం ఉంది. ఇక్కడ వల్లభుడి ఆలయానికి నిత్యం ఉత్తరాది రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. పిఠాపురం నుండి పంచారామాల్లో ప్రసిద్ధి గాంచిన సామర్లకోట, ద్రాక్షారామంతో పాటు, వీరవెంకటసత్యన్నారాయణ సన్నిధి అన్నవరం క్షేత్రాలకు రవాణా సౌకర్యం ఉంది. సముద్రతీర ప్రాంతం కాకినాడ బీచ్, ఉప్పాడ చేనేత కుటీర పరిశ్రమలు గురించి తెలుసుకునేందుకు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వెళుతుంటారు.
