తూ.గో.జిల్లాలో క‌రోనాతో త‌హ‌సీల్దారు మృతి

సీతాన‌గరం,(ADITYA9NEWS) : తూర్పుగోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం మండ‌లంలో త‌హ‌సీల్దారుగా ప‌నిచేస్తున్న శివ‌మ్మ క‌రోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల కింద‌ట ఆమెకు క‌రోనా రాగా, కాకినాడ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజ‌న్ లెవిల్స్ త‌గ్గ‌డంతో ఆమె మృతి చెందారు. ఎంతో సౌమ్యురాలిగా ఉండే శివ‌మ్మ మృతి ప‌ట్ల రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా, తూర్పుగోదావ‌రి జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం నాయ‌కులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. జిల్లాలో రెవిన్యూ శాఖ నుండి వ‌రుస‌గా ఉద్యోగులు కోవిడ్ భారీన ప‌డ‌టం, కొంద‌రు మృత్యువాత ప‌డ‌టం ఉద్యోగుల్లోనూ క‌రోనా ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :