పెద్దాపురం, (ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డులో టిప్పర్ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాళ్లరేవు మండలం పెద్ద వలసకు చెందిన 9 మంది సభ్యులు కారులో రాజమండ్రి గృహా ప్రవేశానికి గురువారం తెల్లవారు జామున బయలు దేరారు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది.
ఈఘటనలో కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. కారు నుజ్జవడంతో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసు శ్రమించారు. మృతదేహాలను పెద్దాపురం మార్చురికి పంపించారు. గాయపడ్డ మిగిలిన ఐదుగురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.