ఎరుపెక్కుతున్న‌ స‌ముద్రం

కాకినాడ‌, (ADITYA9NEWS): సాధార‌ణంగా స‌ముద్రం అన‌గానే నీలి రంగుతో ఉవ్వెత్తున కెరటాలు ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తాయి. కాని కాకినాడ స‌ముద్రం మాత్రం నీలం నుండి ఎరుపుగా మారుతోంది. అయితే ఇది కేవ‌లం తుఫాన్‌ల కాలంలో మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని స్థానిక మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అరేబియాలో ఏర్ప‌డ్డ తౌక్టే తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల ఇక్క‌డ కెర‌టాల‌ ఉధృతి పెరిగి స‌ముద్ర‌పు అంచున ఎరుపు రంగు క‌నిపిస్తుందంటున్నారు వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు. స‌ముద్ర‌పు తీరం రంగు మారుతుండ‌టాన్ని కొంత మంది ఇదొక వింత‌గా చెబుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :