స‌ముద్రంలో ఆయిల్ దొంగ‌లు

ఉప్పాడ‌, (ADITYA9NEWS): తూర్పుగోదావ‌రి జిల్లా ఉప్పాడ – కాకినాడ తీర ప్రాంతంలో ఆయిల్ దొంగ‌లు రెచ్చిపోతున్నారు. స‌ముద్రం తీరానికి కొంత దూరంలో ఆగిన భారీ షిప్‌ల నుండి ఆయిల్ దొంగిలించి, డ‌బ్బాల‌తో బ‌య‌ట ప్రాంత వాసుల‌కు అమ్మేస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే సుమారు 800 లీట‌ర్ల ఆయిల్‌ను తీసుకొచ్చి బ‌య‌ట ప్రాంతానికి త‌ర‌లిస్తుండ‌గా యు.కొత్త‌ప‌ల్లి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయిల్ డ‌బ్బాల‌ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

పిఠాపురం సిఐ వై .ఆర్‌.కె . శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో కొత్త‌ప‌ల్లి ఎస్సై అబ్దుల్ న‌బీ కేసు విచార‌ణ చేస్తున్నారు. ఆయిల్ ముఠా చాలా కాలం నుండి ఇదే వ్యాపార‌న్ని స‌ముద్ర మార్గం గుండా చేస్తున్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయిల్ వ్యాపారం ద‌ర్జాగా సాగిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :