పెద్దాపురం,(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాలో మూతపడ్డ ఆక్సిజన్ ప్లాంట్ పునఃప్రారంభానికి యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్లాంట్ కు అవసరమైన సామాగ్రి, విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.
జిల్లా జాయింట్ కలెక్టర్ లక్మీషా , పెద్దాపురం ఆర్డీవో మల్లిబాబుల పర్యవేక్షణలో ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైతే రోజుకి వందల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లలలో ఆక్సిజన్ ఫిల్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దాపురంలో పునఃప్రారంభమవుతున్న ఈ ప్లాంట్ జిల్లాకు సంజీవినిగా మారుతుందన్న ఆశాభావంతో అధికారులు, పాలకులు ఎదురు చూస్తున్నారు.