కోవిడ్‌తో చ‌నిపోతే ద‌హ‌న సంస్కారాల‌కు రూ.15 వేలు

 

జీవో.347 విడుద‌ల చేసిన స‌ర్కార్‌

అమ‌రావ‌తి,(ADITYA9NEWS): ఎవ‌రైనా కోవిడ్‌తో చ‌నిపోతే ద‌హ‌న సంస్కారాల‌కు ఇక‌పై వారి బంధువులుగాని, కుటుంబ‌స‌భ్యులు గాని ఇబ్బందులు పడ‌కుండా రూ.15 వేలు న‌గ‌దును అందించి ఆ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు జీవో. 347 విడుద‌ల చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్త‌ర్వులిచ్చారు.

కోవిడ్‌తో మృతి చెందిన వివ‌రాలు క‌లెక్ట‌ర్‌కు పంపించాలి. రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. ద‌హ‌న సంస్కారాల‌కు సంబంధిత ప్రాంతాలలో ఉండే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది ద్వారా స‌మాచారం తీసుకుని సంబంధిత మృతుల‌ ద‌హ‌న సంస్కారాల‌కు రూ.15 వేలు అందివ్వ‌నున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :