హైదరాబాద్,(ADITYA9NEWS): దేశంలో పెట్రోలు ధరల అడ్డుకు హద్దులేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ కు 36 పైసలు పెరిగి, రూ.102.32 గా ఉంది. డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.96.89 కి చేరింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.104.67 ఉండగా, డీజిల్ రూ.98.63 కు చేరింది. ఇక విశాఖలో పెట్రోల్ ధర లీటర్ రూ.103.47 వద్ద ఉండగా, లీటర్ కు డీజిల్ ధర రూ.97.47గా ఉంది.
మెట్రో నగరాలైన దిల్లీ, ముంబాయిలో పెట్రోలు రేట్లు భగభగమంటున్నాయి.దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.52 ఉండగా డీజిల్ రూ. 88.95కు చేరింది. ముంబయిలో అయితే లీటరు పెట్రోల్ ధర రూ. 104.62గా ఉండగా ,డీజిల్ ధర 96.48 చేరడంతో వాహనదారులకు చమటలు పడుతున్నాయి.ఇక చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.55, డీజిల్ రూ. 93.51గా ఉంది.కోల్ కత్తాలో లీటర్ పెట్రల్ ధర రూ. 98.36, డీజిల్ ధర రూ. 91.80కు చేరింది.