తూ.గో.జిల్లా కొత్త ఎస్పీ రవీంద్రనాథ్
కాకినాడ ,(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా నూతన పోలీసు సుపరింటెండెంట్‌గా యమ్.రవీంద్రనాథ్ బాబు మంగళవారం (13న)మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.గత ఎస్పీ నయీమ్ హాస్మీ బదిలీ కాగా, జిల్లా 81వ ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు నియమితు లయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డి.జి.పి గౌతమ్ సవాంగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతలే ప్రధానం
ముఖ్యంగా మహిళా సమస్యలపై దృష్టిసారించి వారికి అండదండగా ఉండి వారికి కావలసిన న్యాయం చేసి,అండగా తమ యంత్రాంగం ఉంటుదని కొత్త ఎస్పీ స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని, సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తా మన్నారు. వేద పండితుల ఆశీర్వంచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబును డీఎస్పీలు , సి.ఐ లు ,ఎస్‌ఐ లు , పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని స్వాగతం పలికారు.