19 నుండి స‌ద‌ర‌న్ (దివ్యాంగుల) క్యాంపులు

మీ సేవా కేంద్రాలలో స్లాట్‌ల బుకింగ్ సౌక‌ర్యం

అమ‌రావ‌తి, (ADITYA9NEWS): రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ప్రభావంతో నిలిచిపోయిన స‌ద‌ర‌న్(దివ్యాంగుల‌) క్యాంపుల‌ను ఈనెల 19 నుండి నిర్వ‌హించడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 16 నుండి మీ సేవా కేంద్రాలలో స్లాట్‌ల బుకింగ్ కు అవ‌కాశం క‌ల్పించింది. 19వ తేది నుండి సంబంధిత స‌ద‌ర‌న్ కేంద్రాల వ‌ద్ద వైద్యులు దివ్యాంగుల అర్హ‌త‌ల‌ను ప‌రిశీలిస్తారు. అనంత‌రం ఆన్‌లైన్ ద్వారా వీరికి ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందిస్తారు. ఈమేర‌కు ఎపీవీవీపి క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దివ్యాంగుల ఫించ‌న్‌కు, ఇత‌ర ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌కు స‌ద‌ర‌న్ ధృవీక‌ర‌ణ ప‌త్రం అవ‌స‌రం ఎక్కువ ఉండ‌టంతో స‌ద‌ర‌న్ క్యాంపుల ద్వారా వీటిని అందిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, టీచింగ్ ఆసుపత్ర‌లతో క‌లిపి రాష్ట్ర‌వ్యాప్తంగా 171 ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో స‌ద‌రం క్యాంపుల‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :