ఆరుగురు యువకులు సురక్షితం
కాకినాడ, (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ రోడ్డులో మత్తులో ఉన్న ఆకతాయిల సరదాతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు కారుతో చేసిన హంగామా ఇబ్బందులకు గురి చేసింది. మద్యం మత్తులో బీచ్ రోడ్డులో కారు నడిపిన యువకులు హైస్పీడుతో సముద్రంలోకి దూసుకెళ్లిపోయారు. సముద్రంలో కొంత దూరం వరకూ కారు వెళ్లడంతో అక్కడే ఉన్న పర్యాటకలు కంగారు పడ్డారు. సముద్రంలోకి వెళ్లిపోతున్న కారును బలంగా వెనక్కిలాగారు. కొద్ది సేపటికి ఓ ట్రాక్టర్ ద్వారా బయటకు తీశారు. ఉప్పాడ బీచ్ రోడ్డు నుండి కాకినాడ వైపు వెళుతున్న ఈకారు ఒక్కసారిగా బీచ్‌రోడ్డులో అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారును బయటకు తీయడంతో అందులో ఉన్న ఆరుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.