ఆషాడ మాసం.. మరిడమ్మ దర్శనం
పెద్దాపురం,(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాడమాసం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలోకి భక్తులను అనుమతించారు ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పసుపు కుంకుములు సమర్పించి మరిడమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతీయేటా ఆషాడ మాసంలో అమ్మవారిని దర్శించుకుని కోరుకుంటే కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడ పరిసర ప్రాంతాల్లోని భక్తులు నమ్మకం.