*.హైదరబాద్‌లో ఘటన..పరారై తూ.గో.జిల్లాలో చిక్కిన దుర్మార్గుడు.
*.దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు.
హైదరబాద్ / కరప(తూ.గో), (ADITYA9NEWS) : అస్సలు మాటలకందని దుర్భుద్ధి ఘటన ఇది. సమాజం మారుతున్న ఇంకా మృగాళ్ల తీరు మారడం లేదనేదానికి ఉదాహరణ. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కామపిశాచుల్లా తయారవుతున్నారనే దానికి ఈసంఘటనే నిదర్శనం. కన్న కూతుర్నే కడుపు చేసి పరారైన ఓ నీచుడైన తండ్రిని పట్టుకుని దేహశుద్ధి చేసిన దుర్మార్గపు ఘటన , తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన జి. వెంకటరమణ అనే వ్యక్తికి కరప మండలం వేములవాడ సమీపంలో ఉన్న సిరిగలపల్లి లంకకు చెందిన మహిళతో 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. జీవనోపాధి కోసం కుటుంబంతో సహా వెంకటరమణ సుమారు పదేళ్ల కిందట హైదరబాద్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు వెంకటరమణ.
ఫిల్మ్‌నగర్ వద్ద అపార్ట్‌మెంట్‌లలో కాపలా ఉంటూ,అక్కడే ఇళ్లలో పనిచేసుకుంటూ భార్యభర్తలు జీవిస్తున్నారు. సంతానంలో ఒకరైన కుమార్తె 10వ తరగతి చదువుతోంది. కరోనా ప్రభావంతో స్కూళ్లకు సెలవులు ఉండటంతో ఇంటివద్దే ఉంటోంది.
ఈక్రమంలో తల్లి పనికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసుకుని దుర్భుద్దితో ఉన్న తండ్రి కుమార్తెను లోబర్చుకున్నాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల నుండి కుమార్తెకు అలసటగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది తల్లి. మీ కుమార్తె 5 నెలలు గర్భవతి అని వైద్యులు చెప్పడంతో తల్లి గుండె పగిలిపోయింది. కారకులెవరని ఆరాతీసిన తల్లికి , కట్టుకున్నభర్తే ఇలా చేసాడని తెలియడంతో కుదేలైపోయింది.
ఇంతలోగా విషయం బయటకు రావడంతో వెంకటరమణ తూర్పుగోదావరి జిల్లా కరప వద్ద ఉన్న సిరిగలపల్లి లంకలోని బంధువుల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. భార్య జరిగిన సంఘటనను సిరిగలపల్లిలోని బంధువులకు హైదరబాద్ నుండి ఫోన్ ద్వారా తెలిపింది. మాటు వేసిన బంధువులు కరప సమీపం వాకాడ బస్టాండు వద్ద తిరుగుతుండగా పట్టుకుని చెట్టుకు కట్టి , దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సంఘటనపై హైదరబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు బాధితురాలి బంధువులు తెలిపారు.