వానల దాటికి కూలుతున్న తీరంలోని ఇళ్లు
ఉప్పాడ,(ADITYA9NEWS) : వానొచ్చిందంటే రైతుకు సంబరం, నీళ్లులేని గ్రామాలకు ఓ వరం. కాని ఆఊరికి మాత్రం శాపం. అదే తూర్పుగోదావరిజిల్లాలోని ఉప్పాడ. అక్కడ తీరం వెంబడి ఉన్న ఇళ్లు వరుసగా కూలిపోతున్నాయి. అధిక వానలు, తుఫాన్‌లు వచ్చినప్పుడల్లా వరుసగా ఇళ్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి.
ఆలయాలు, బడులు, ఇళ్లు ఇలా ఇప్పటికే చాలా వరకూ తీరంలో ఉన్న నిర్మాణాలన్ని సముద్ర గర్భంలో కలిసిపోయాయి. తాజాగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పాడ తీరం వాసులు హడలిపోతున్నారు. అధిక వర్షాలు వస్తే కేవలం దగ్గర్లో బడుల్లో పునరావసం తప్పితే తమకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.