కేంద్రాన్ని కోరిన కాకినాడ ఎంపీ గీత
దిల్లీ,(ADITYA9NEWS): కరోనా విపత్కర సమయంలో విపరీతంగా పెరిగిపోతున్న వంట గ్యాస్,పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని కాకినాడ పార్లమెంట్ మెంబర్ వంగా గీతా విశ్వనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆమె దిల్లీలో పార్లమెంట్ ఎదుట నిలబడి ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. రెండేళ్ల పాలనలో 39 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు,5 సార్లు వంట గ్యాస్ పెంచినట్లు కేంద్రమంత్రే స్వయంగా చెప్పినట్లు ఆమె వెల్లడించారు. సామాన్యులు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీతాలు కూడా లేని స్థితిలో చాలా మంది కష్టాలు పడుతున్నారని, వారిని చూసైన కేంద్రం స్పందించాలన్నారు.