తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ “మీట్ ద ప్రెస్“ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావు అధ్యక్షతన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

మీట్ ద ప్రెస్ లో

ఈటెల రాజేందర్ కామెంట్స్

 

రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం.

రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే

చరిత్ర నిర్మాతలు ప్రజలే.. గెలిపించేది ఓడించేది ప్రజలే

తెలంగాణ యువనయ్య జాగిరి కాదు ప్రజలది

ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా… బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్

ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని

స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు.

తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ “మీట్ ద ప్రెస్“ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావు అధ్యక్షతన

కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రశ్నించి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని విమర్శించారని

కార్పొరేషన్లు పెట్టి, తప్పుడు GSDB ప్రకటించి FRBM పెంచుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలవుతాయో లేదో అన్న సోయి ఉండాలి కదా అని. సోయి ఉండి, ఎన్ని అబద్ధాలైనా చెప్పి, అవగాహన ఉండి హామీలిచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

అధికారం లేని నాడు ఒకమాట, ఉన్ననాడు మరో మాట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారున్నారు.

మొన్న మోదీ మా పెద్దన్న అన్నారు. ఇవాళ మోదీని తిడుతున్నారని… ఇదెం పద్దతని ప్రశ్నించారు.

అధికారం వస్తుందని కాంగ్రెస్ ఊహించలేదని. వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ ప్రజానీకమంతా ధరణి సమస్యలతో బాధపడుతున్న అన్నమో రామచంద్రా అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా

దానిపై కమిటీ ఎందుకు వేయలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినది నిజం. ప్రాజెక్టు కుంగిపోయింది.. కానీ ఏఏ ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయన్నది చూసుకొని పంటలను కాపాడాల్సి ఉంది. చాలా కాలం తర్వాత నీళ్ల కోసం పరితపించాల్సి వస్తోంది. కళ్ల ముందు పంటలు ఎండిపోతున్నాయి. దీనికి ఎవరు కారణమో ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్ లా మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది?

అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను పరిశీలించి, సూచనలు, సలహాలను తీసుకోవాలన్నారు.

ఆనాడు కేసీఆర్ దానిని సహించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దీనిని సహించడం లేదన్నారు.

ఏ రైతు డిక్లరేషన్ వరంగల్ లో చేశారో.. రైతుల పంటలు ఎండిపోతున్న విషయం నిజం కాదా.. తెలంగాణ రైతుల్లారా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ దేవుడెరుగు పాత బకాయి కేసీఆర్ చెప్పిన లక్ష రూపాయల మాఫీ కూడా రింగ్ రోడ్డు అమ్మినడబ్బులు వడ్డీకి సరిపోయాయి కానీ అసలు ఇంత వరకు తీరలేదన్నారు.

వెంటనే రెండు లక్షల రూపాయల రుణాలు తెచ్చుకోవాలని రేవంత్ చెప్పారని అన్ని చానలళ్ళల్లో వీడియో ఫుటేజ్ ఉందన్నారు కేసీఆర్ ఎంతిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తానని హామీలిచ్చారు. పదవిలోకి రావాలనా ఆశ తప్ప ప్రజల సమస్య తీర్చాలన్న తపన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఏ ఒక్కరికి లేదన్నారు.

పంటకు 500 బోనస్ ఇస్తానన్నారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగా 2 వేలిస్తానని రేవంత్ చెప్పారన్నారు. అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనుకున్నా…

కానీ అవి అమలు కాకుండానే పోయాయన్నారు.

2 వేల పింఛన్ 4 వేలు చేస్తానన్నాడు. దాని ఊసే లేదని బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ లేదన్నారు.

అందులోనూ కొత్త బస్సుల్లేవ్… అనేక హామీలిచ్చారు. హామీలిస్తానన్న మాట నిజమే కానీ, కేసీఆర్ చిప్పచేతికిచ్చాడని చెప్పడం దారుణమన్నారు ఈటల.

అప్పుల కోసం పోతున్నామన్నారు. కేంద్ర ఆర్థిక, హోం, ప్రధాన మంత్రిని కలిశారని… దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు పద్దతి ప్రకారం చేస్తాయన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా చేస్తారన్నారు. కేంద్రాన్ని నిందించే అవకాశం కూడా లేదన్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, మీరు గానీ 17లో 17 గెలిపిస్తే రాహుల్ ప్రధాని మంత్రి అవుతారు. సమస్యను పరిష్కరిస్తామని ఇప్పుడు చెప్తున్నారన్నారు. దేశంలో 543 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లున్నాయి. ఆప్కీబార్ చార్ సో పార్ అంటూ దేశమంతటా నినదిస్తోందని, కానీ కాంగ్రెస్ 17 సీట్లిస్తే రాహుల్ ప్రధాని అవుతారంటున్నారని ఇది సాధ్యమా అన్నారు.

272 సీట్లొస్తే తప్ప కేంద్రంలో అధికారం రాదని దేశ వ్యాప్తంగా ఎంత ఊపు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు కూడా రావన్నారు .తెలంగాణ అంతా తన జాగీరేనని భావిస్తున్నారన్నారు.

కేసీఆర్ ఏ తప్పులైతే చేశారో… రేవంత్ కూడా అదే తప్పు చేస్తున్నారన్నారు.

పొన్నాల పార్టీ వీడితే.. అన్నీ పదవులు అనుభవించిన మీరు… పొన్నాల లక్ష్మయ్యను తిట్టిపోశారన్నారు. కేశవరావు, కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నారని బయటకు వచ్చారు. BRS కేశవరావు రెండు సార్లు రాజ్యసభ చేశారన్నారు. కేసీఆర్ కేశవరావు కుటుంబంలో ముగ్గురికి పదవులిచ్చారన్నారు. అయినా ఆయన్ను ఎందుకు తీసుకున్నావు సమాధానం చెప్పాలన్నారు.

కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు కడియం శ్రీహరి దళితుడే కాదన్నారు. ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు. రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిని చేశారన్నారు.

దానం నాగేందర్ కు రాజీనామా చేయకుండా సీటు ఎలా ఇస్తారని ఈటల ప్రశ్నించారు.

పార్టీలు మారినవారు పదవులకు రాజీనామా చేయకపోతే తీసుకోబోమని కాంగ్రెస్ చెప్పిందన్నారు.

కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రులయ్యారని, రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం పార్టీలు మారిన వారిని సస్పెండ్ చేస్తామంటున్నారు. దానం నాగేందర్ కు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఆధారం లేకుండా, ధర్మం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఈటల మాట్లాడబోరన్నారు.

మల్కాజ్‌గిరి వచ్చి ఈటలకు ఏం సంబంధమని రేవంత్ అంటున్నారు. పొత్తుల సద్దిగా తెలంగాణ బిడ్డగా ప్రజలు ఎవరిని అంటారని ఈటల ప్రశ్నించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి పరిగి వరకు అన్నా బాగున్నావా అంటారన్నారు. నేను మల్కాజ్ గిరి పోటీ చేస్తున్నా… కొడంగల్ ఓడితే ప్రశ్నిస్తావని నాడు గెలిపించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీని గెలిపించలేకపోయారు. బయట సీట్లు ఓడినా పర్లేదు, ఈటల ఓడిపోవాలని అంటున్నారని దుయ్యబట్టారు. ఆనాడు భంగపడి ఇక్కడకు వస్తే ప్రజలు గెలిపించారు. మల్కాజ్‌గిరి ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ పనిచేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయారు. మీ అభ్యర్థిని మీరెక్కడ్నుంచి తెచ్చారని ఈటల రేవంత్ ను ప్రశ్నించారు.

మళ్లీ కేసీఆర్ లా, డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. ఏం జరగాలన్నా, బిల్లులు రావాలన్నా, పోలీస్ స్టేషన్లో , ఎమ్మార్వో ఆఫీసులో గౌరవం పెరగాలంటే పార్టీలోకి రావాలంటున్నారని ఈటల దుయ్యబట్టారు. ఉపాసముండి… అటుకులుబొక్కిన కేసీఆర్ హుజూరాబాద్ లో 600 కోట్లు ఖర్చు పెట్టారు. వైట్ మనీ 800 కోట్లున్నాయన్నాడు. తెలంగాణ ఎన్నికలు డబ్బులమయమైపోయాయన్నారు.

అలానే నిన్ననే అధికారంలోకి వచ్చిన రేవంత్ కు ఇంత డబ్బు ఎలా సాధ్యమైందన్నారు. డబ్బుల్లేకున్నా ప్రజలు నాడు గెలిపించారన్నారు. రెండు చోట్ల ఓడిపోవడం నా స్వయంకృతమన్నారు ఈటల. ప్రజలు అసహ్యించుకున్న ఫార్ములాను మళ్లీ తెస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాళ్లుండాలి. ప్రజల పక్షాన, పేదల పక్షాన అణగారిన వర్గాల కొట్లాడే పక్షాన ఉండేవారిని పార్టీల్లోకి తీసుకోవడమేంటన్నారు. ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరో దారా అన్నారు. కౌన్సిల్ ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తే పైసలుకు అమ్ముడుపోయారన్నారు. ఇప్పుడు నీకెలా అమ్ముడుపోతున్నారో చెప్పాలన్నారు. ఎందుకీ వలసలని ప్రశ్నించారు ఈటల. తెలంగాణలో ఇలాంటి పోకడ చెల్లదన్నారు. బీఆర్ఎస్ ఓడాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు ఈ పద్ధతి గురించి ఏం మాట్లాడతారో చూద్దామన్నారు. ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు కర్రుగాల్చి వాతపెడుతున్నారన్నారు.

మల్కాజ్ గిరి చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఎడ్యూకేడెట్ ఎక్కువ ఉన్నవారందరూ మల్కాజ్ గిరిలో ఉన్నారన్నారు. మినీ ఇండియా మల్కాజ్ గిరి అన్నారు. దేశం వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ సెటిలయ్యారన్నారు. గొర్రెల మందలపై తేడేల్లుపడ్డట్టుగా చేస్తున్నారన్నారు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ పరిస్థితులను మార్చుకోవాల్సింది కేవలం ప్రజలు మాత్రమేనన్నారు. కేవలం అమ్ముడుపోయిన నాయకులు మాత్రమే మట్లాడతారన్నారు. గతాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలన్నా, బాంబుపేలుళ్లు ఉండరాదనంటే మోదీ రావాలన్నారు. జమ్ము, కశ్మీర్ లో ప్రశాంతత నెలకొందన్నారు. నేడు అమెరికా సెనెట్ లో మీద మాట్లాడుతుంటే అక్కడి నేతలు చప్పట్లు కొడుతున్నారన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించమని మోదీని కోరుతున్నారన్నారు. దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. సెల్ ఫోన్లు మేడినిండియా అయ్యిందన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ప్రపంచంలో ఇండియా నెంబర్ 2 అయ్యిందన్నారు. ప్రశాంతత, ధర్మం, న్యాయం ప్రజాస్వామ్యం, అభివృద్ధి ఉండాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ రాష్ట్ర సహయ కార్యదర్శి బాపురావు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య రాష్ట్ర నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :