బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

జై తెలంగాణ న్యూస్ హైదరాబాద్  ప్రతినిధి ఏప్రిల్ 07 

లోక్‌సభ ఎన్నికల వేళ వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ పార్టీకి (BRS) మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కీలక నేత, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావ్ గత రాత్రి (శనివారం) తక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలోనే రాహుల్ సమక్షంలోనే పార్టీలో చేరినప్పటికీ నేడు (ఆదివారం) సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాను కప్పి సాదరంగా రేవంత్ ఆహ్వానించారు.
కాగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెల్లం వెంకట్రావ్ మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ 8, సీపీఐ 1 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు పలువురు ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :